భారత్ సహా 14 దేశాల పై ఖతార్ నిషేధం

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాయి. విదేశీయులను తమ దేశాలకు రాకుండా నిషేధాలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగా గల్ఫ్ దేశం ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కరోనా తమ దేశంలోకి వ్యాపించకుండా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. వీటిలో ఇండియా, చైనా, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, ఇరాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సిరియా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, దక్షిణకొరియాలు ఉన్నాయి. ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  ఇప్పటికే  కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ నుంచి విమాన రాకపోకలను ఖతార్ నిషేధించింది.

Latest Updates