గల్ఫ్​ దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 1,547 కేసులు

ఖతార్: గల్ఫ్ దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఖతార్​లో గడిచిన 24 గంటల్లో 1,547 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ వెబ్​సైట్​లో ఆదివారం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 30,972 కు చేరుకుందని తెలిపింది. అయితే, మృతుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. శనివారం కరోనా ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఒకరు మృతిచెందడంతో ఆ దేశంలో ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 15 కు పెరిగిందని ప్రకటించింది. ఇప్పటివరకు 3,788 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు.

Latest Updates