క్వాల్‌కం కంపెనీకి 0.15% వాటా అమ్మిన జియో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. తన వాటాల అమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం క్వాల్‌ కం కంపెనీకి జియోలోని 0.15 శాతం వాటాను అమ్మింది. రూ.730 కోట్ల పెట్టుబడు లను క్వాల్‌కం వెంచర్‌ కంపెనీ.. జియోలో పెట్టనుంది. ఎంటర్‌ప్రైజెస్‌ వాల్యూ రూ.5.16 లక్షల కోట్లు అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. క్వాల్‌కం వాటాతో 5G రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, భారత్‌ డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేస్తుందని రిల్‌ ఎండీ ముకేష్‌ అంబానీ తెలిపారు. అన్ని కంపెనీలు 5Gని కోరుకుం టున్నాయని, రానున్న కొన్నేళ్లల్లో అన్ని కంపెనీలు 5G టెక్నాలజీకి మారిపోతాయని క్వాల్‌కం సీఈఓ స్టీవ్‌ మోలెన్‌కోప్ఫ్‌ తెలిపారు. జియో ప్లాట్‌ఫాం డిజిటల్‌ రంగంలో ఓ సరికొత్త వి ప్లవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. డిజిటల్‌తో పాటు టెక్నాలజీ రంగం ఎంతో దూసుకెళ్లిందని వివరించారు. జియోలో 0.15 శాతం వాటా దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు స్టీవ్‌. క్వాల్‌కం కంపెనీ ఇప్పటి కే.. పోర్టియా, క్యాపిల్లరీ టెక్నాలజీ, బౌన్స్‌, ఐడియా ఫోర్జ్‌, ఫ్యాబ్‌ హోటల్స్‌, నిన్జా కార్ట్‌, షాడో ఫాక్స్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

రిల్‌ ఖాతాలో రూ.30వేల కోట్లు

జియోలో దాదాపు 25.09 శాతం వాటాలను అమ్ముతూ రిల్‌ చేసుకున్న డీల్స్‌ వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటిల్లో నాలుగు డీల్స్‌ నుం చి రూ.30,062 కోట్లు అం దించినట్టు ఆ సంస్థ సెబీకి అందజేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దాదాపు 6.13 శాతం విలు వైన వాటాలకు సంబంధించి ఎల్‌ కాటర్టన్‌, ది పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ తో  అగ్రిమెంట్లు పూర్తైయినట్లు చెప్పింది.

Latest Updates