కుషాయిగూడ డీ మార్ట్ ను సీజ్ చేసిన అధికారులు

మేడ్చల్ జిల్లా : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డి మార్ట్స్ లో కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలోనే కుషాయిగూడ డి మార్ట్ లో సరుకుల కొలతలలో తేడా.. నిత్యావసర వస్తువులలో నాణ్యత లోపం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కాప్రా సర్కిల్ GHMC అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగారు అధికారులు. కుషాయిగూడ డి మార్ట్ లోని కొనుగోలుదారులను బయటకు పంపించి డీ మార్ట్ ను సీజ్ చేశారు.

నాణ్యతలేని.. కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు కస్టమర్లు గుర్తించి GHMC అధికారులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న కాప్రా సర్కిల్ GHMC ఏఎంహెచ్ఓ మైత్రి, కుషాయిగూడఎస్సై మదన్ లాల్ సరుకులు, కొలతలను పరిశీలించి డీ మార్ట్ ను సీజ్ చేశామని తెలిపారు.

Latest Updates