వైట్ హౌజ్ లో నాసిరకం కరోనా టెస్టింగ్ కిట్స్

వాషింగ్టన్ : కరోనా టెస్ట్ లకు సంబంధించి నాసిరకం కిట్ల బెడద అమెరికాకు తప్పటం లేదు. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించిన ఓ కంపెనీ కిట్లు రాంగ్ రిజల్ట్స్ చూపించాయి. కరోనా ఉన్న వారికి కూడా ఇవి నెగిటివ్ అని చూపిస్తున్నాయి. ఇటీవల వైట్ హౌజ్ లో ఉద్యోగులకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల్లో రిజల్స్ రాంగ్ వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం లో తెలిపింది. ఉద్యోగుల్లో కొంతమందికి కరోనా ఉన్నప్పటికీ నెగిటివ్ రిజల్ట్స్ చూపించాయని గుర్తించారు. ఐతే దీనిపై అబాట్ సంస్థ వివరణ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్తితుల్లో మాత్రమే ఇలాంటి తప్పుడు రిజల్ట్స్ వస్తాయని ప్రకటించింది. ఐతే వైట్ హౌజ్ లోని కీలకమైన సభ్యులకు కూడా కరోనా సోకింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నారు.
మాస్క్ కంపల్సరీ
ఇక వైట్ హౌజ్ కు వచ్చే వారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే వారంతా తప్పకుండా మాస్క్ ధరించాలని లేదంటే వారికి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ లకు ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న…వైట్ హౌజ్ లో ని ఉద్యోగులకు సోకుతున్న తాను మాత్రం మాస్క్ ధరించనని ట్రంప్ చెబుతున్నారు.

Latest Updates