ఇంట్లో క్వారంటైన్‌.. ఇలా ఉంటేనే సేఫ్

ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకితే.. అది ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ కు సోకడానికి పెద్దగా టైం పట్టదు. అందుకే ఇంట్లో వైరస్ ఉంటే.. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ సోకిన వాళ్లు కరోనా వచ్చిందని తెలియగానే డీలా పడిపోయి, కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. పాజిటివ్ మైండ్‌ సెట్‌ తో వైరస్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. ఇంట్లోనే ఉంటూ సరైన జాగ్రత్తలు, ఫుడ్ తీసుకోవడం ద్వారా చాలామంది వైరస్ నుంచి కోలుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒక ఇంట్లో వైరస్ సోకితే ఆ ఇంట్లో ఎలా సేఫ్‌ గా ఉండాలో సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్కం ట్రోల్) కొన్ని జాగ్రత్తలు సూచించింది. అవేంటంటే..

జాగ్రత్తలు ఇలా..
వైరస్‌ ఉన్న ఇంట్లో బట్టలు, గిన్నెలు, ప్లేట్స్ లాంటివాటిని ఎప్పటికప్పుడు వాష్
చేస్తూ ఉండాలి. అలాగే పడుకునే మంచం, దుప్పటి, దిండు లాంటివి రోజూ
క్లీన్‌ చేయాలి. భోజనం తినే ప్లేట్స్‌‌‌‌ను కూడా శుభ్రంగా పెట్టు కోవాలి. అలాగే
వీలైనంత వరకూ ఇంట్లో అందరూ గ్లోవ్స్ తొడుక్కోవడం, తరచూ చేతులు వాష్
చేసుకోవడం, రోజుకి మూడు నుం చి నాలుగు సార్లు స్నా నం చేయడం
లాంటివి చేయాలి. సిక్ అయిన వ్యక్తికి ఫుడ్ అందించేటప్పుడు లేదా సాయం
కోసం దగ్గరకెళ్లినప్పుడు మాస్క్, గ్లోవ్స్ కచ్చితంగా ఉండాలి. కరోనా ఉన్న వ్యక్తి ప్రతీ రెండు గంటలకు ఒక సారి చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. కరోనా ఉన్న
వ్యక్తి రూం పొడిగా ఉండాలి. నీటి చెమ్మ ఉండకూడదు. ఫ్యాన్ వాడొచ్చు. కానీ
ఏసీ వాడకూడదు. తుమ్ము, దగ్గును బలవంతంగా ఆపకూడదు. మోచేతిని
అడ్డు గా పెట్టు కొని అప్పుడు తుమ్మాలి. ఆ తరవాత వెంటనే చేతుల్ని సబ్బుతో
కడుక్కోవాలి. ఇలా ప్రతిసారీ చేస్తూ నే ఉండాలి. ఫైనల్‌ గా.. క్లీన్ అండ్ క్లీన్ .
వైరస్ సోకిన వాళ్లు ఇంట్లో ఉంటే ఇదొక్కటే సేఫ్టీ ఫా ర్ములా .

ఇలాసేఫ్..
ముందుగా వైరస్ సోకిన వాళ్లు రెండు వారాల పాటుసెల్ఫ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలి. ఇక్కడ ఐసోలేషన్‌‌‌‌కు క్వారంటైన్‌‌‌‌కు కొద్దిగా తేడా ఉంది. వైరస్ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడం, ఎవర్నీ కలవకపోవడం లాంటివి సెల్ఫ్ క్వారంటైన్ కిందకు వస్తాయి. కానీ ఐసోలేషన్ అంటే.. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన నుంచి పక్కవాళ్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఎవరికి వాళ్లు వేరుగా ఉండాలి లేదా ఉంచాలి. అంటే వైరస్ సోకిన వ్యక్తి ఇంట్లో ఐసోలేషన్‌‌‌‌లో ఉంటే, మిగతా వాళ్లు క్వారంటైన్‌‌‌‌లో ఉండాలి.
సోకిన వ్యక్తి ఇలా..
ఇంట్లో వైరస్ సోకిన వ్యక్తి, అదే ఇంట్లోని మిగతా వాళ్లు వేర్వేరు జాగ్రత్తలు పాటించాలి. ముందుగా వైరస్ సోకిన వాళ్లు ఇంట్లో ఒక సెపరేట్ రూమ్‌‌‌‌లో ఉండాలి. ఇంట్లో ఎవరికీ రెండు మీటర్ల కంటే దగ్గరగా రాకూడదు. పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులు వుంటే వాటిని దగ్గరకు రానీయెద్దు. వాళ్ల వస్తువులను సెపరేట్‌‌‌‌గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేస్తూ ఉండాలి. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలి. డాక్టర్ సూచించినట్టుగా తింటూ, మందులు టైం టు టైం వేసుకోవాలి. పేరెంట్‌‌‌‌కు పాజిటివ్ వస్తే పిల్లల బాగోగులను మరొక ఫ్యామిలీ మెంబర్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలి.
కరోనా సోకిన వ్యక్తి మెడికేషన్‌‌‌‌తో పాటు, ఇమ్యూనిటీని పెంచే హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. అయిన వాళ్లకు రోజూ కాల్ చేస్తూ టచ్‌‌‌‌లో ఉండాలి. ఆకలి లేదని తినకుండా ఉండొద్దు. కచ్చితంగా తినాలి. కరోనా వైరస్ శరీరంలో శక్తినంతా పీల్చేస్తుంది. రోజురోజుకూ మనిషి వీక్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఫుడ్ ఎక్కువగా తినాలి.
ఇంట్లో వాళ్లు ఇలా..
వైరస్ సోకిన వాళ్లలో ఎలాంటి భయం కలగకుండా ఇంట్లోవాళ్లు ధైర్యం చెప్తుండాలి. వారికి బోర్ కొట్టకుండా కాలక్షేపం అయ్యేలా చూడడం, సరైన ఫుడ్, మెడిసిన్స్‌‌‌‌తో పాటు వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చాలి. రోజూ వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేసేలా ఎంకరేజ్ చేయాలి. పిల్లల్ని కూడా వాళ్లతో మాట్లాడిస్తుండాలి. ఫ్రెండ్స్, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌తో వీడియో కాల్స్‌‌‌‌ చేయించాలి. అలాగే ఎప్పుడూ గదిలోనే ఉంచకుండా.. బయటగాలి పీల్చుకునేలా కారిడార్ లాంటి ఏరియాల్లో కొంతసేపు నడవమని చెప్పాలి. అది అందరూ తిరిగే కారిడార్ అయితే కనుక దాన్ని వెంటనే క్లీన్ చేయాల్సి ఉంటుంది. వైరస్‌‌‌‌ సోకిన వాళ్లకి బేసిక్ నీడ్స్‌‌‌‌తో పాటు ఎమోషనల్‌‌‌‌గా ధైర్యాన్ని, సపోర్ట్‌‌‌‌ను అందించాలి. వాళ్లను వేరుగా చూడకుండా కంఫర్టబుల్‌‌‌‌గా ఉంచాలి. ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నన్ని రోజులు ఇంటికి విజిటర్స్‌‌‌‌ను , బంధువులను రానీయకపోవడమే మంచిది.
రెండు వారాల తర్వాత..
ఈ ఐసోలేషన్‌‌‌‌లో సుమారు పది నుంచి పద్నాలుగు రోజులు తప్పనిసరిగా ఉండాలి. జ్వరం పూర్తిగా తగ్గే వరకూ ఐసోలేషన్‌‌‌‌లోనే ఉండాలి. రెండు వారాల తర్వాత జ్వరం తగ్గినట్టు అనిపిస్తే.. ఒక మూడు రోజులు చూడాలి. ఎలాంటి మెడిసిన్ లేకుండా సుమారు 72 గంటల పాటు జ్వరం రాకుండా ఉంటే అప్పుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలవాలి.

కోలుకున్న వాళ్ల టిప్స్
కరోనా నుంచి కోలుకున్న చాలామంది వాళ్లు ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకున్నారో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నా రు. వాళ్లలో చాలామంది మెంటల్‌‌‌‌గా ధైర్యంగా ఉండడమే దీనికి మందు అని చెప్తున్నా రు. డాక్టర్ చెప్పినట్టుగా దగ్గు, జ్వరానికి మందులు వేసుకోవడం, ఫ్రూట్స్, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్​ తీసుకోవడం చేస్తున్నా రు. డైలీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని దాన్నే ఫాలో అవుతున్నారు. కొంత మంది రోజూ ఉదయాన్నే లెమన్, పసుపు, అల్లం , మిరియాలు వేసిన కషాయాన్ని తాగే వాళ్లమని చెప్తున్నారు. మరి కొందరు వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తూ.. రిలాక్స్ అయ్యామని చెప్తున్నా రు. అన్నింటి కంటే ముఖ్యంగా.. భయపడకుండా పాజిటివ్‌‌‌‌గా ఉంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందనేది వాళ్లు చెప్పేమాట.

Latest Updates