క్వారంటైన్ లో వీడియో కాల్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్.. క్యాండిల్స్ ఎలా ఆర్పాడో చూడండి

క‌రోనా మ‌హ‌మ్మారి ఒక్క‌సారిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ లైఫ్ స్టైల్ మార్చేసింది. వైర‌స్ వేగంగా ప్ర‌బ‌లుతుండ‌డంతో చాలా దేశాలు లాక్ డౌన్ పెట్టేశాయి. ఎక్క‌డి వారు అక్క‌డే ఇళ్ల‌లో నిలిచిపోయారు. బ‌ర్త్ డే ఫంక్ష‌న్లు, పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్లు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. జ‌నం ఒక చోట చేర‌కూడ‌ద‌ని, సోష‌ల్ డిస్టెన్సింగ్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆదేశాలు ఉండ‌డంతో కొంత మంది వెరైటీగా ఆన్ లైన్ లో, వీడియో కాల్స్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ‌ర్త్ డే ఫంక్ష‌న్లు కూడా ఇలా వినూత్నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు కొంత మంది యువ‌త‌. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని వీడియో కాల్ లో ఇన్వైట్ చేసి హోం క్వారంటైన్ లో ఉన్నా కూడా స‌ర‌దాగా టైం స్పెండ్ చేస్తున్నారు.

అన్ని గ్యాడ్జెట్స్ ఎలా..

అలీ అనే ఓ యువ‌కుడు నాలుగు రోజుల క్రితం త‌న బ‌ర్త్ డేను వెరైటీగా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక చోట నుంచి మ‌రో చోట‌కి ప్ర‌యాణాలు బంద్ అయిపోవ‌డంతో ఎవ‌రూ బ‌ర్త్ డే పార్టీకి రాలేని పరిస్థితి నెల‌కొంది. దీంతో ఆ యువ‌కుడికి ఫ్రెండ్స్ అంతా వీడియో కాల్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే అంటూ అంద‌రూ విష్ చేస్తుండ‌గా మాస్క్ వేసుకుని ఉన్న ఆ యువ‌కుడు వెరైటీగా క్యాండిల్స్ ఆర్పాడు. పొర‌బాటున‌ నోటిలో నుంచి తుంప‌ర్లు కేక్ పైన ప‌డినా దాన్ని తినాలంటే కుటుంబ‌స‌భ్యులు సైతం భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో అత‌డు నోటితో ఊప‌కుండా హెయిర్ డ్రైయ‌ర్ తో క్యాండిల్స్ ఆర్పాడు. త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీనిపై వేలాది మంది కామెంట్స్ చేశారు. చాలా మంది హ్యాపీ బ‌ర్త్ డే అని విష్ చేయ‌గా.. మ‌రికొంద‌రు సూప‌ర్ ఐడియా అని కామెంట్లు పెట్టారు. అయితే కొంద‌రు మాత్రం అక్క‌డ చాలా ల్యాప్ టాప్స్, ట్యాబ్స్ ఉండ‌డం చూసి.. క్యూరియాసిటీ ఆపుకోలేక అన్ని గ్యాడ్జెట్స్ మీ ద‌గ్గ‌ర ఎందుకున్నాయంటూ అడిగారు.

వీడియో చూడండి..

Latest Updates