గురుకుల స్కూల్స్ లో క్వారంటైన్ కేంద్రాలు

నాగ‌ర్ క‌ర్నూల్- కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. దీనికి ప్రజలు సహకరించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. శ‌నివారం ఆయ‌న నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంత‌రం 100 పడకల క్వారంటైన్ కేంద్రం కోసం గురుకుల పాఠశాలలోని భవనాలను పరిశీలించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన ఆయ‌న‌.. కరోనా అరికట్టడానికి సోషల్ డిస్టెన్నే ఏకైక మార్గమ‌న్నారు.

అగ్రరాజ్యాలే కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను తెలిపి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, ఉమ్మడి జిల్లా పరిధిలో క్వారంటైన్‌ సెంటర్లు సిద్ధం చేశామ‌న్నారు.

Latest Updates