గాంధీ ఆస్పత్రికి బ్రిటన్ రాణి కోడలు

queen elizabeth daughter in law sophie coming to hyderabad gandhi hospital

ఆస్పత్రిలో పర్యటించనున్న సోఫీ

హైదరాబాద్, వెలుగు: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్–2 చిన్న కోడలు, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్ సోఫీ ఈనెల 29న గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు.ఉదయం 11.00 నుం చి 12 గంటల వరకు ఆమె ఆస్పత్రిలో ఉంటారు. ఇన్ బర్న్, అవుట్ బర్న్ యూనిట్ లతోపాటు ఇంక్యూబేటర్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోనున్నారు. నియోనాటాలజీ విభాగాన్ని పరిశీలిస్తారు. నెలలు నిండకుండా జన్మించి, కంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిడండ్రులతో ఆమె మాట్లాడనున్నారు.

క్వీన్ ఎలజిబెత్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ భార్యే  సోఫీ. క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ఫౌండేషన్ పేరుతో సోఫీ ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో పలు ఆరోగ్య సమస్యల నివారణకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి క్వీన్ ఫౌండేషన్ పని చేస్తోంది. ప్రీ మెచ్యూ ర్డ్ బేబీల కంటి సమస్యలపై ‘రెటినల్ అబ్జర్వేటరీ ఇన్ప్రీ మెచ్యూ ర్డ్’ పేరుతో దేశవ్యా ప్తంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు క్వీన్ ఎలిజబెత్ ఫౌండేషన్ ద్వారా నిధులు అందిస్తున్నారు.

గాంధీలో కూడా ఈ సంస్థల సేవలు అందుతున్నాయి. ఇక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు సోఫీ వస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్లతో ఆమె పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Latest Updates