జయలలితగా రమ్యకృష్ణ పోస్టర్ రిలీజ్

జయలలిల జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ కూడా తెరకెక్కుతుంది. ఇందులో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ లుక్‌ లో ర‌మ్య‌కృష్ణ జెండా అంచు కలిగిన తెల్ల చీర ధరించి, వేదికపై నిలబడి ప్రజలనుద్దేశించి మాట్లాడుతుంది.

క్వీన్ అనే టైటిల్‌ తో వెబ్ సిరీస్ రూపొంద‌నుండ‌గా,  MX ప్లేయర్‌ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ వెబ్ సిరీస్‌ రానుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జయలలిత పేరుతో పలు భాషల్లో బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Latest Updates