వైరల్ వీడియో: తాడు ఇవ్వమ్మా.. చచ్చిపోతానంటూ 9ఏళ్ల చిన్నారి వేదన

ఎగతాళిగా గేలి చేస్తూ మాట్లాడడానికి ఓ లిమిట్ ఉంటుంది. పరిమితి దాటితే పెద్దలే తట్టుకోలేరు. అలాంటిది ఆ పసి ప్రాణం ఎలా తట్టుకోగలదు. పదేపదే అవహేళన చేసేవాళ్లపై పెద్దలైతే తిరగబడడమో.. లేదంటే మరో రకంగానో రివేంజ్ తీర్చుకోవడమే చేస్తారు. కానీ 9 ఏళ్ల చిన్నారి మసను తొటి పిల్లల సూటిపోటి మాటలకు ఎంతటి వేదనకు గురైందో ఏమో.. అమ్మా ఒక తాడు ఇవ్వు.. చచ్చిపోతా అంటూ ఏడ్చేశాడు.

ఆస్ట్రేలియాలోని బ్రస్బేన్ ప్రాంతానికి చెందిన ఖ్వాడెన్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి జన్యు పరమైన సమస్యతో పుట్టాడు. దీంతో ఆ చిన్నారి తోటివారిలా ఎత్తు పెరగకుండా మరగుజ్జుగా ఉండిపోయాడు. ఈ లోపాన్ని చూసి స్కూల్ లో తోటి పిల్లలు ఏడిపించసాగారు. వాళ్ల ఎగతాళిని భరిస్తూ వచ్చిన ఆ చిన్నారి.. ఎన్ని రోజులు గడిచినా క్లాస్ మేట్స్ తీరు మారకపోవడంతో విసిగిపోయాడు. మనసు నొచ్చుకుని.. స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి యారకా బేల్స్ రాగానే.. ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యాడు.

నేను చచ్చిపోతా.. లేదంటే ఎవరైనా చంపేయండి

తల్లి స్కూల్ దగ్గరకు రాగానే కారులో కూర్చుని ఏడ్చేశాడు ఖ్వాడెన్. ‘అమ్మా.. నేను బతకను.. నాకు ఒక తాడు ఇవ్వు.. చచ్చిపోతా’ అంటూ రోదించాడు. కత్తి అయినా ఇవ్వు.. గుండెల్లో పొడుచుకుని చనిపోతా లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి అని విలపించాడు. తన కొడుకు బాధను వీడియో తీసిన తల్లి.. స్కూల్ లో తోటి పిల్లల తీరును ప్రస్తావిస్తూ, వాళ్ల తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో అంటూ ఫేస్ బుక్ లో బుధవారం పోస్ట్ చేసింది.

This is the impacts of bullying! I seriously don’t know what else to do! 😭

Posted by Yarraka Bayles on Tuesday, February 18, 2020

చిన్నారి బాధను చూసి కరిగిపోయి…

ఆ పసివాడు తాను బతకనంటూ ఏడుస్తున్న తీరు చూసి నెటిజన్లు చలించిపోయారు. ఫేస్ బుక్ లో ఒక్క రోజులోనే 70 లక్షల మంది ఆ వీడియోను చూశారు. లక్షన్నర మందికిపైగా షేర్ చేశారు. ఆ చిన్నారిని ఓదారుస్తూ.. ధైర్యంగా ఉండాలని చెబుతూ 89 వేల మంది కామెంట్లు చేశారు. ఆస్ట్రేలియా ఆల్ స్టార్స్ రగ్బీ టీమ్ ఆ చిన్నారికి బాధను చూసి కరిగిపోయింది. ఏడవకు.. మేమున్నామంటూ ధైర్యం చెప్పింది ఆ టీమ్. ‘నీకు అండగా ఉంటాం’ అని చెబుతూ వీడియో చేసి పంపారు. శనివారం జరిగే మ్యాచ్ లో తమ టీమ్ గ్రౌండ్ లో దిగేటప్పుడు ముందు నిలబడి లీడ్ చేయాలని ఆహ్వానించారు.

Latest Updates