బాటిళ్లు కాదు,దోసిళ్లతో నీళ్లు తాగండి: మీనాక్షి లేఖి

దేశంలో ఒకప్పటి అలవాట్లను మళ్లీ తీసుకురావాలని, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ను త్వరగా వదిలించుకోవాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ బాటిళ్లు, గ్లాసుల్లో నీళ్లు తాగడం ఆపేసి దోసిళ్లతో తాగాలని సూచించారు. బ్రష్‌‌‌‌‌‌‌‌లు వదిలేసి వేపపుల్లతో పళ్లు తోముకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ‘ఎనర్జీ ట్రాన్సేషన్‌‌‌‌‌‌‌‌, సబ్సిడీలు, ఎయిర్‌‌‌‌‌‌‌‌క్వాలిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్’పై ఢిల్లీలో శుక్రవారం జరిగిన రౌండ్‌‌‌‌‌‌‌‌టేబుల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. లేని అలవాట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ మన దేశం చాలా శక్తిని, వనరులను వృథా చేసుకుంటోందన్నారు. దేశంలో సింగిల్‌‌‌‌‌‌‌‌ యూజ్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘కూరగాయలమ్మే అతను వచ్చినప్పుడు మేం వెదురు బుట్టల్ని తీసుకెళ్తున్నాం. బ్రష్‌‌‌‌‌‌‌‌లు వదిలేసి చాలా రోజులైంది. అవన్నీ డస్ట్‌‌‌‌‌‌‌‌బిన్‌‌‌‌‌‌‌‌లో వేశాం. ఇంట్లో నో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌. పాత బట్టల్ని తిరిగి ఉపయోగించుకోవచ్చు. బ్యాగ్స్‌‌‌‌‌‌‌‌, శానిటరీ ప్యాడ్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేసుకోవచ్చు. మన అమ్మమ్మలు, నానమ్మలు అదే చేశారు. మనమెందుకు చేయకూడదు?. శానిటరీ ప్యాడ్స్‌‌‌‌‌‌‌‌పై జీఎస్టీ వేసినప్పుడు మహిళలంతా ఉద్యమించారు. నావరకైతే సమర్థించను. వాటి వాడకాన్ని తగ్గించాలంటే జీఎస్టీ పెంచాలి. 28 శాతం ఉండాలి.’ అని అన్నారు. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తొలగించే ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కొన్ని ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వస్తువులపై నిషేధం ప్రకటించే అవకాశముందని ఆమె చెప్పారు.

Latest Updates