వాళ్లిద్దరూ నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు

మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ప్లేయింగ్ ఎలెవన్‌‌ను కూడా ప్రకటించింది. హిట్‌‌మ్యాన్ రోహిత్ శర్మ, యంగ్ పేసర్ నవ్‌‌దీప్ సైనీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ పై భారత జట్టు కెప్టెన్ అజింక్యా రహానె స్పందించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను రహానె ప్రశంసించాడు. అశ్విన్ ఎప్పుడూ నేర్చుకోవడానికి కుతూహలంగా ఉంటాడని, జడేజా తన బ్యాటింగ్‌‌ను మెరుగుపర్చుకుంటూ జట్టుకు వెన్నెముకగా మారాడని చెప్పాడు.

‘అశ్విన్ ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. అతడు మంచి నైపుణ్యం ఉన్న ప్లేయర్. అయినా నూతన విషయాలు నేర్చుకోవడానికి అస్సలు వెనుకాడడు. అందుకే అశ్విన్ గ్రేట్ బౌలర్‌‌గా ఎదిగాడు. జడేజా కూడా తనను తాను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాడు. టీమ్ పరంగా చూసుకుంటే ఒక బ్యాట్స్‌‌మన్‌‌గా జడేజా ఎదగడం చాలా మంచి విషయం. ఏడో నంబర్‌‌లో వచ్చే బ్యాట్స్‌‌మన్ బాగా బ్యాటింగ్ చేస్తే మంచి స్కోరు చేయొచ్చు. జడ్డూ ఓ ఫెంటాస్టిక్ ప్లేయర్’ అని రహానె చెప్పాడు.

Latest Updates