2లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీ

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య గురువారం డిమాండ్ చేశారు. అన్నిశాఖల్లో కలిపి 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు . హైదరాబాద్‌ లో నిరుద్యోగ సంఘర్షణ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌ లో ఐదేళ్లుగా 16వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. చదువులు పూర్తి చేసి 15 లక్షల మంది జాబుల కోసం చూస్తున్నారన్నారు . ఉద్యోగులు లేక కొత్త జిల్లా కార్యాలయాలు వెలవెలబోతున్నాయన్నారు. గ్రూప్‌ వన్‌ పోస్టులు 1,200,జిల్లాలు, మండల కేంద్రాల్లోని ఆఫీసుల్లో 30వేలు, గ్రూప్‌-4 ఉద్యోగాలు 36 వేలు, టీచర్లు 40 వేలు, విద్యుత్‌ శాఖలో 25 వేలు, ఆర్టీసీ లో15 వేలు, పంచాయతీరాజ్‌ లో 12 వేలు, మున్సిపల్‌, కార్పొరేషన్‌ లో 20 వేలు, వైద్యారోగ్య శాఖలో16 వేలు, రెవెన్యూలో 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ జాబితావిడుదల చేశారు.

Latest Updates