కేసీఆర్.. మందు బ్యాన్ చేయండి.. క్రైమ్ తగ్గుతది: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్‌, వెలుగు: మహిళలు, అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే మందు నిషేధించడమే శాశ్వత పరిష్కారమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. సీఎం కేసీఆర్‌ స్పందించి మద్యపాన నిషేధం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. షాద్ నగర్, వరంగల్‌లో దుర్మార్గులు దారుణంగా ఆడబిడ్డలను చంపిన ఘటన మానవ సమాజాన్ని కదిలించిందన్నారు. రాష్ట్రం లో ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బహిరంగంగా రోడ్ల మీదే తాగి .. తూగుతున్నారని, ఈ పరిస్థితి అరికట్టకపోతే రాష్ట్రం లో ఇంకా శాంతి భద్రతలు చేజారిపోతాయన్నారు. బీహార్‌లో మద్యపాన నిషేధం తర్వాత అత్యాచారాలు, హత్యలు తగ్గిపోయాయని చెప్పారు. గతంలో ఉమ్మడి ఏపీలో కూడా మద్యపా న నిషేధం అమల్లో ఉన్నప్పుడు అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక సంఘటనలు తగ్గాయని గుర్తు చేశారు.

Latest Updates