రాక్షసుడు : మూవీ రివ్యూ

రివ్యూ: రాక్షసుడు

రన్ టైమ్: 2 గంటల 29 నిమిషాలు

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్,అనుపమా పరమేశ్వరన్,రాజీవ్ కనకాల తదితరులు

సినిమాటోగ్రఫీ : వెంకట్ సి.దిలీప్

మ్యూజిక్ : జిబ్రాన్

కథ,స్క్రీన్ ప్లే: రామ్ కుమార్

మాటలు: సాగర్

నిర్మాతలు: అభిషేక్ పిక్చర్స్,కె.ఎల్ యునివర్శిటీ

దర్శకత్వం: రమేష్ వర్మ

రిలీజ్ డేట్: ఆగస్ట్ 2,2019

కథేంటి..
సినిమా దర్శకుడవ్వాలనే కల తో ఆ ప్రయత్నాల్లో విఫలమైన అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) తప్పని పరిస్థితుల్లో ఎస్.ఐ ఉద్యోగం చేయ్యాల్సి వస్తుంది.తన సినిమా కోసం రాసుకున్న థ్రిల్లర్ కథ లాగే..తనకు వచ్చిన సీరియల్ కిల్లర్ కేసు ను డీల్ చేయాల్సి వస్తుంది.హైస్కూల్ అమ్మాయిలను అతి కిరాతకంగా చంపేస్తుంటాడు సైకో.ఆ కేసును అరుణ్ ఎలా చేధించాడు.అందులో తను ఫేస్ చేసిన చాలెంజెస్ ఏంటి అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఇప్పటివరకు చేసిన ఏడు సినిమాల్లో తన నటన గురించి కంప్లయింట్స్ ఎక్కువ వచ్చాయి శ్రీనివాస్ కు.కానీ ఈ సినిమాలో తనకు ఏది సూట్ అవుతుందో తెలసుకున్నట్టున్నాడు.ఆ క్యారెక్టర్ లో చక్కగా ఒదిగిపోయాడు.ఎక్కడా ఓవర్ చేయకుండా డీసెంట్ పర్ఫార్మెన్స్ అందించాడు శ్రీనివాస్.అనుపమా పరమేశ్వరన్ కు పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కలేదు కానీ..ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది.రాజీవ్ కనకాల మరోసారి మంచి పాత్రలో రాణించాడు.సైకో పాత్ర చేసిన అతను కూడా బాగా చేశాడు.

టెక్నికల్ వర్క్:

ఇలాంటి సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ బాగుండాలి.ఈ సినిమాకు అది బాగా కుదిరింది.ముఖ్యంగా జిబ్రాన్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది..ఆర్ట్ వర్క్ బాగుంది.ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.

విశ్లేషణ:

‘‘రాక్షసుడు’’ ఆద్యంతం కట్టిపడేసే థ్రిల్లర్ సినిమా. తమిళ సినిమా ‘‘రాట్ససన్’’ కు రీమేక్.అక్కడ కూడా బాగా ఆడింది. ఈ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా తీసారు. అందువల్ల ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్లు ఇష్టపడతారు. అయితే ఆ సినిమాను చెడగొట్టకుండా ఎంగేజింగ్ గా తీసి మంచి పని చేశారు. అందుకే ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండే  ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ ముందు వచ్చే స్కూల్ టీచర్ సన్నివేశం అదిరింది. రామ్ కుమార్ స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు అధ్బుతం. ప్రతీ సీను కట్టిపడేసేలా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ తర్వాత ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్. అయితే క్లైమాక్స్ లో కాస్త లాగ్ అయినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ కు ఎక్కువ భాగం క్రెడిట్ ఇవ్వచ్చు. నార్మల్ సీన్లను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పైకి లేపాడు. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘‘రాక్షసుడు’’ బాగా నచ్చుతుంది.

Latest Updates