ములాయంకి వయసైపోయింది: రబ్రీ దేవి

సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కు వయసైపోయిందని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి అన్నారు. ములాయం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. ఆయన పొంతన లేని స్టేట్మెంట్లు ఇస్తున్నారని రబ్రీ దేవి అన్నారు.

నిన్న లోక్ సభలో ములాయం సింగ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. దీనిపై రబ్రీ దేవిని బిహార్ లో మీడియా మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Latest Updates