అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్

హైదరాబాద్ : గిఫ్ట్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్ నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు. హైదరాబాద్ కు చెందిన అబ్బాయితో సోఫియా అనే అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. మీకోసం ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వస్తున్నాను అని మెసేజ్ పెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాను. నా దగ్గర 75వేల పౌండ్స్ క్యాష్, గోల్డ్ చైన్స్,మొబైల్ ఫోన్స్ కు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని బాధితుడితో డబ్బులు వేయించుకున్నారు.

ఇలాంటి ముఠా సభ్యులు ఢిల్లీలో ఒక చోట కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. డింగ్ టోన్ అనే ఆప్ ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారని..తమ అకౌంట్లో వేయించుకున్న నగదుతో ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. గుర్తు తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదని తెలిపిన పోలీసులు..ఇలాంటి తరహాలో మోసాలు పెరుగుతున్నాయన్నారు. మ్యాట్రిమోనీ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని..జేమ్స్ బాండ్ లాగా ప్రొఫైల్ తయారు చేసి మోసం చేస్తున్నారన్నారు. రాచకొండలో ఏడుగురు వీరి చేతిలో మోసపోయినట్టు తెలుస్తుందన్నారు పోలీసులు.

Latest Updates