చరిత్రకు సాక్ష్యం మన రాచకొండ!

‘‘ఎల్‌ బీనగర్‌ లో తిరుగుతున్న ప్రతి పోలీస్‌ బండిపై ‘రాచకొండ’ అని రాసి ఉంది. ‘ దొంగలనుపట్టు కున్న రాచకొండ పోలీసులు’ అని వార్తలు కూడా వస్తుంటయ్‌. అసలు ఈ రాచకొండ ఎక్కుడుంది? అన్న.. దీని ప్రత్యేకత ఏంటి? నాకు చూడాలని ఉంది’’ అనడిగింది మా చెల్లె సౌమ్య. నా పేరు గుండమల్ల సంతోష్ కుమార్‌ . ఎంబీఏ కంప్లీట్‌ చేసిన. మాది రాచకొండ ప్రాంతమే అయినప్పటికీ.. హైదరాబాద్‌ లో ఉండటం వల్ల చూడటానికి వీలుపడలేదు. నేనన్నా.. ఓ సారిరాచకొండను చూసిన కానీ..మా చెల్లెకు మాత్రం దాని గురిం చే తెల్వదు. తన కోసం మా అమ్మా,అమ్మ వాళ్ల  దోస్తు స్వప్న.. మొత్తం నలుగురం కలిసి మార్చిల రాచకొండ పోయినం! రాచకొండమొత్తం చూసినంక… ‘ఇంత చరిత్ర ఉందా? మన ఊరికి’ అని మా చెల్లె ఆశ్చర్యపోయిం ది.మా చెల్లెలాగనే దీని గురిం చి తెల్వనోళ్లు మస్తు మంది ఉన్నరు. అందుకే ‘రాచకొండ గుట్ట’చరిత్రని.. అక్కడ మేం పొందిన అనుభూతిని ‘లైఫ్‌ లో మీ ముచ్చట’తో పంచుకోవాలనిపించింది.

పుస్తకాలకు ఎక్కిందే చరిత్ర అనుకుంటేపొరపాటు. మన చుట్టూ ఉండేపరిసరాల్లో నాటి మానవుడు మిగిల్చిపోయినప్రతి గుర్తు చరిత్రే.గుర్తింపు పొందినది మాత్రమే చరిత్ర కాదు. తనవెనకటి మనిషి ఎట్ల బతికిండో తెలుసుకోవాలనిప్రతి మనిషికి ఉంటది. ఆ తపనను, ఆ అన్వేషణతాలూకు దాహాన్ని తీర్చేవి చరిత్ర ఆనవాళ్లే!అలా చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లలో ఒకప్పటి‘రాచకొండ రాజ్యం’ ఒకటి!

సంకెళ్ల బావి

ఎక్కడుంది?
హైదరాబాద్‌ కు సమీపంలో ఉమ్మడినల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఉన్నరాచకొండ గుట్టలకు ఎంతో ప్రత్యేకత ఉన్నది.చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే.. రాచకొండ గతమంతా ఘనమే. యాంత్రిక జీవనానికి, కాలుష్యానికి దూరంగాఒక రోజు ప్రశాంతంగా గడిపి రావాలనుకునే వాళ్లకు రాచకొండ మంచి విడిది. కళ్లు తిప్పనియ్యకుండా చేసే ‘రాచకొండ ముఖద్వారం’ అందరికీ స్వాగతం పలుకుతూ ఆలోచనలన్నింటిని నాటి కాలానికి మళ్లిస్తది. గట్టి బండరాళ్లతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ప్రాకారాలు, ఆనాటి రక్షణ వ్యవస్థ పటిష్టతని తెలియజేస్తయ్‌. ఆరు వందల అడుగులఎత్తైన ఆ గుట్టపై రాచకొండను ఏలిన రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన ప్రభువులు కొలువుదీరేవారంట.

పురాతన దేవాలయం

అనుకున్న తెల్లారే..
మా చెల్లె సౌమ్య ఇంటర్‌ చదువుతోంది. మార్చిలో తను రాచకొండ గురించి అడిగినప్పుడు.. ‘వీలున్నప్పుడు తీస్కపోతలేరా’అని చెప్పిన. ‘కాదు.. కాదు. కాలేజీకి రెండురోజులు సెలవులు ఉన్నయ్‌ . రేపే పోదాం’అని పట్టువట్టింది. ‘సరే’ అని… తెల్లారి… హైదరాబాద్‌ నుంచి రాచకొండ పయనమైనం. చెల్లి, అమ్మ, అమ్మ ఫ్రెండ్‌ స్వప్న… ముగ్గురిని తీసుకుని కారులో పోతుంటే.. చౌటుప్పల్‌ నుంచి రాచకొండ చేరుకునే దారిలో పచ్చనిచెట్లు , అందమైన రాళ్ల గుట్టలు.. ప్రదేశాన్ని బట్టిప్రకృతి ఎట్ల మారుతుందో కళ్లకు కట్టింది. కారు అద్దాలు తీసి మరీ బయటకు చూస్తున్న మా చెల్లె సంతోషానికి అవధులే లేవు.

కొండపైకి చేరగానే..
కొండ చుట్టూ ప్రాకారం.. మధ్య మధ్యన ఎత్తైనబురుజులు, వాటిపై పేల్చడానికి సిద్ధంగా ఉన్నఫిరంగుల అమరికలు ఉన్నయ్ . వాటిని దాటికొండపైకి చేరినం. ఈ గుట్టపైన మండపాలు,రాజప్రాసాదాలు, తటాకాలు, జలాశయాలుకనిపించినయ్‌. అవన్నీ నాటి జీవనశైలికిచిహ్నాలు. గుట్టపైనే రెం డు పెద్ద బండరాళ్ల చీలికమధ్య ‘సంకెళ్ల బావి’ ఉంది. ఏ కాలమైనా..అందులో నీళ్లు ఉండటం విశేషం! గుట్ట మొత్తంతిరిగితే.. ఎక్కడ చూసిన అద్భుత శిల్ప సంపదకనవడింది.

తవ్వకాల్లో బయటవడ్డ శివలింగం

ఆ చిహ్నాలు ఇంకా ఉన్నయ్‌
రాచకొండ చేరుకోంగనే.. ముందుగాఅక్కడ తవ్వకాల్లో బయటవడ్డ శివలింగాన్నిదర్శించుకున్నం. నాటి గొప్ప శిల్ప సంపద,శైవ భక్తి మూలాలకు అది ప్రతీక. సౌమ్యకుశివుడు అంటే చాలా ఇష్టం . దర్శనం తర్వాతరాచకొండ గ్రామంలో ఉన్న శ్రీరాముల వారిగుడికి వెళ్లి.. దాని చరిత్ర తెలుసుకున్నం . అక్కడదర్శనం ముగించుకుని.. రాచకొండ గుట్టపైకిసాగినం. ముఖద్వారం నుంచి ఆరువందలఅడుగుల ఎత్తు న్న గుట్టపైకి ఎక్కుతుంటేఆయాసం రావడం ఖాయం. అందుకే మధ్యమధ్యలో ఆక్కుంట … మొత్తం మీద గుట్టపైకిఎక్కి నం. అక్కడ చుట్టూ ఎటూ చూసిన చూపుతిప్పుకోలేని.. వారసత్వ సంపద కనిపించింది.ఆనాటి రాచకొండ రాచరిక అవశేషాలు,విధ్వంసపు చిహ్నాలు కనవడ్డయ్‌ . ఇగగుట్టమీద రెం డు బండరాళ్ల మధ్యలో .. ఉన్నసంకెళ్ల బావి చూసి ఆశ్చర్యపోయినం. చుట్టూచూస్తే.. ఎడారిలాగా నీళ్ల జాడలేదు. ‘ఇందులోనీళ్లెక్కడంగ వచ్చినయబ్బా’ అని అట్లనేచూస్తూ ఉండిపోయినం. గుట్ట మీది నుంచికిందకు చూస్తుంటే కనవడే ఆహ్లాదకరమైనవాతావరణం గురించి మాటల్లో చెప్పలేం.గుట్ట మీద మొత్తం తిరుగుతూ అందరం కలిసిఫొటోలు దిగినం. తర్వాత అమ్మ తీసుకొచ్ చినఅన్నం … అక్కడే ఉన్న ఒక గుండు మీద కూసొనితిన్నం.సౌమ్యకు ఇల్లు, కాలేజీ తప్ప..బయటి ప్రపంచంతెల్వదు. అమ్మ దోస్తు స్వప్నకు కూడా గ్రామీణవాతావరణంతో పెద్దగా పరిచయం లేదు.‘ఎంత మంచి ప్లేస్‌ కు తీసుకొచ్ చినవో’ అనిఅందరూ ఖుషి అయితూ నాకు థ్యాం క్స్‌చెప్పి నరు! సాయంత్రం వరకు అక్కడే గడిపి..తర్వాత ఇంటి బాట పట్టినం. ఆ జ్ఞా పకాలు..అలాగే ఉండిపోయినయ్‌ . ఇలా కుటుంబసమేతంగా.. రాచకొండకు వెళ్లి.. మా లాంటిఅనుభూతిని పొందొచ్చని ఎంతోమందికితెలియజేయాలనే ఉద్దేశంతో… ‘ లైఫ్‌ లో మాముచ్చట’తో నా అనుభవాలు పంచుకున్న.

సంకెళ్ల బావి

జర పట్టించుకోవాలె
ఇంత గొప్ప చరిత్ర కలిగిన రాచకొండనుగత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినయ్‌ .తెలంగాణ ఏర్పడినంక ఈ ప్రాంత అభివృద్ధికిపునాదులు పడినయ్‌ . రాచకొండ పేరునునిత్యం తలచుకునే విధంగా ‘ రాచకొండకమిషనరేట్’ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ఫలితంగా ఈ ప్రాంతానికి కొంత గుర్తింపువచ్చింది. కానీ, పురావస్తు శాఖ వాళ్లు దీన్నిఅంతగా పట్టించుకోవడం లేదు.దీంతో చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన గొప్పగొప్ప కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నయ్‌ .రక్షణ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల శిల్పసంపద తరలిపోతోంది. రాచకొండలో ఉన్న150కి పైగా దేవాలయాలు, ఇతరకట్టడాలు శిథిలావస్థకు చేరకుండా ప్రభుత్వంచొరవ తీసుకోవాలె. రాచకొండనుఅభివృద్ది చేసి.. పర్యా టక కేంద్రంగా మార్చాలె.

రాచకొండ రాజ్యం

కాకతీయ రాజ్య పతనం తర్వాత రేచర్ల పద్మనాయకుల పాలన.. రాచకొండ కేంద్రంగా సుమారు వందేళ్ల పాటు సాగింది. 1361లో పద్మనాయకులు తమ రాజధానిని ఆమన గల్లునుంచి రాచకొండకు మార్చినరు. తర్వాత కాలంలో నేటి తెలంగాణ అంతటికీ తమ రాజ్యాన్ని విస్తరించినరు. రేచర్ల పద్మనాయకుడు వంశానికి చెందిన అనపోత నాయుడు 1361 నుంచి1384 వరకు రాచకొండను పాలించిండు. అతని కాలంలోనే ఈ రాచకొండ దుర్గాన్ని నిర్మించినరు. ఈ రాజులంతా శైవమతాభిమానులు.. అందుకే గుట్టలపై సోపానాలు, శివాలయాలను నిర్మించినరు. నాటి అగ్రహారాలు, దేవాలయాలు, విద్యాలయాలుగా విలసిల్లేవి. రాచకొండను పాలించిన మూడో సింగభూపాలుడు ఏటా వసంతోత్సవాలను ఏర్పాటు చేసి..సకల కళా కోవిధులను సన్మానించేవాడు. అతను స్వయంగా కవి కూడా.విశ్వకవి, పశుపతి, నాగపండితుడు, బొమ్మకంటి అప్పయదార్యుడు, గౌరన్న వంటి పేరుగాంచిన కవులంతా ఇతని ఆస్థానంలోని వాళ్లే. అంతా వేదాంతాలు, ఇతిహాసాలు, పురాణాలు, అలంకార శాస్త్రాలు, రాజనీతి, సంగీత కళాశాస్త్రాలను అవపోసన పట్టిన దిట్టలేనంట. కొంతకాలం తర్వాత బహుమని సుల్తాన్‌ ల దాడికి రాచకొండ రాజ్యం పతనమైంది.

Latest Updates