అసభ్యకర పోస్టర్లు ఎక్కడున్నా సమాచారం ఇవ్వండి

%e0%b0%aa%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af

నగరంలో యాడ్ బోర్డులపై ఉన్న అసభ్యకర పోస్టర్ లను పోలీసు సిబ్బంది తొలగించారు. ఇందుకుగాను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ట్వీట్ చేశారు. ఉప్పల్ మెట్రో పిల్లర్ దగ్గర ఉన్న యాడ్ బోర్డ్ పై ఉన్న అసభ్యకర పోస్టర్ ను GHMC సిబ్బంది సహాయంతో పోలీసులు తొలగించినట్లు తెలిపారు. సిటీలో మరెక్కడైనా ఇలాంటి పోస్టర్లను గమనిస్తే 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతో పాటు వాట్సప్ నంబర్ ను కూడా ప్రొవైడ్ చేశారు.9490617111 అనే నెంబర్ కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు ఇవ్వవచ్చని చెప్పారు.

Latest Updates