శత్రుదేశాలపై ‘కన్ను’! మే 22న నింగిలోకి రిశాట్ 2BR1

శత్రు దేశాలపై కన్నేసి ఉంచేందుకు ఆకాశంలో ఇంకో ‘కన్ను’ పెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. రాడార్ ఇమేజ్ సాటిలైట్ రిశాట్ 2బీఆర్ 1ను ప్రయోగించనుంది. మే 22న అందుకు ముహూర్తం చేసింది. రిశాట్సిరీస్ శాటిలైటలలో 2బీఆర్ 1 చాలా అధునాతనంగా ఉంటుందని ఇస్రో వర్గాలు చెబుతున్నా యి. ‘‘ఈనెల 22న ప్రయోగం ఉంటుంది. చూడ్డానికి పాత రిశాట్ లాగే కనిపించినా, దాంట్లోని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, వ్యవస్థలు వేరుగా ఉంటాయి. ఈ శాటిలైట్తో నిఘా మరింత పటిష్టం అవుతుంది. దాని ఫొటోలు (ఇమేజిం గ్ ) తీసే సామర్థ్యం ఎక్కువుంటుం ది”  అనిఇస్రో అధికారి ఒకరు చెప్పారు.

రిశాట్ లోని ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ (ఎస్ ఏఆర్ )రాత్రితో పాటు అన్ని వాతావరణాల్లోనూ పనిచేసే సామర్థ్యం దాని సొంతం. ఆకాశంలో మేఘాలు కమ్మేసినా ఒక మీటర్ పాటు అది జూమ్ అవ్వగలదు. భూమిపై ఉన్న బిల్డింగులు లేదా వస్తువులను రోజూ2 నుంచి మూడు సార్లు అది ఫొటోలు తీయగలదని అంటున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని జిహాద్ టెర్రర్ క్యాంపులు, సరిహద్దులు దాటిదేశంలోకి ప్రవేశించే చొరబాటుదారులపై ఓ కన్నేసి ఉంచుతుందని అంటున్నారు. భారత బలగాలకు కొండంత బలంగా నిలుస్తుందని, అన్ని వాతావరణపరిస్థితుల్లోనూ బాగా పనిచేస్తుందని చెబుతున్నా రు. సముద్రంలోని శత్రు దేశాల నౌకలపైనా అది నిఘాపెడుతుంది. హిందూ మహాసముద్రంలో చైనానౌకలు, అరేబియా సముద్రంలోని పాకిస్థా న్ యుద్ధనౌకలపై గస్తీ పెడుతుంది.

రిశాట్ ఫొటోలతో
రిశాట్ తీసి పంపిన ఫొటోల ఆధారంగానే 2016సర్జికల్  స్ట్రైక్స్ , తాజా బాలాకోట్ దాడులను చేసిం దిసైన్యం . విపత్తు నిర్వహణ అప్లికేషన్ల సా మర్థ్యాన్నీ రిశాట్ పెం చింది. 26/11 ముం బై దాడుల తర్వాతఇండియా రిశాట్ 2 ప్రోగ్రాం చేపట్టింది. రిశాట్ 1కన్నా రిశాట్ 2లోని అధునాతన రాడార్ వ్యవస్థలేఅందుకు కా రణం. ఇజ్రాయెల్ తయారు చే సిన ఆరిశాట్ 2ను 2009 ఏప్రిల్ 20న ప్రయోగించా రు.536 కి లోమీటర్ల ఎత్తు నుంచి 24 గంటలూ సరిహద్దులను ఆ శాటిలైట్ గస్తీ కాస్తుంటుంది. లక్షిత ప్రదేశాన్ని పక్కాగా చూపించేందుకు వీలుగా రాడార్యాం టెన్నా కదలికలను ఎస్ఏఆర్ వాడుకుంటుంది. అపర్చర్ ఎంత ఎక్కువుంటే ఫొటో రిజొల్యూషన్ అంత క్లియర్ గా ఉంటుంది. అపర్చర్ ఫిజికల్ (పెద్ద యాం టెన్నా లు) అయినా, సింథటిక్ (కదిల యాంటెన్నాలు) అయినా ఫొటోలు క్లారిటీతో వస్తాయి.

Latest Updates