యాపిల్​ వెబ్‌‌సిరీస్‌‌లో రాధికా ఆప్టే

సినిమాలతోపాటు వెబ్​సిరీస్‌‌లలో కూడా నటిస్తున్న రాధికా ఆప్టే త్వరలో మరో ఇంటర్నేషనల్‌‌ ప్రాజెక్ట్‌‌ చేయబోతుంది. ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌పై అడుగుపెట్టబోతున్న యాపిల్ టీవీ ప్లస్ తెరకెక్కనున్న వెబ్‌‌సిరీస్‌‌లో నటించనుంది. ‘శాంతారామ్‌‌’ పేరుతో రూపొందనున్న ఈ సిరీస్‌‌లో రాధికా ఆప్టే కీలకపాత్ర చేయనుంది. ‘మౌలిన్‌‌ రోగ్‌‌’ ఫేమ్‌‌ రిచర్డ్‌‌ రోక్స్‌‌బర్గ్‌‌ ఇందులో మరో ఇంపార్టెంట్‌‌ రోల్‌‌ పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా జైలు నుంచి తప్పించుకుని ముంబై వెళ్లాలనుకునే ఒక ఖైదీ కథ ఆధారంగా ఈ సిరీస్​ తెరకెక్కనుంది. గ్రెగరీ డేవిడ్‌‌ రాబర్ట్‌‌ రాసిన నవల ఆధారంగా దీన్ని అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు.  ఈ సిరీస్‌‌లో రాధికా ఆప్టే కవిత అనే ఇండియన్‌‌ జర్నలిస్టుగా చేస్తుండగా, రోక్స్‌‌బర్గ్‌‌ ఒక డిటెక్టివ్‌‌ ఆఫీసర్‌‌‌‌గా కనిపిస్తాడు. చార్లీ హన్నామ్​ మరో పాత్ర చేస్తున్నాడు. మొత్తం పది ఎపిసోడ్లుగా ‘శాంతారామ్‌‌’ రూపొందనుంది.

Radhika Apte acts in Apple TV+’s India Shantaram a web series

Latest Updates