మే 4న ‘రాఫెల్ రివ్యూ’

రాఫెల్ ఫైటర్ల కేసు రివ్యూను సుప్రీం కోర్టు మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా రివ్యూ పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. కేసు రివ్యూను నాలుగు వారాల పాటు వాయిదా వేయాలన్న కేంద్ర అభ్యర్థన ను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ తోసి పుచ్చింది. శనివారంలోగా ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ పిటిషన్లకు రిప్లై ఇచ్చి తీరాలని తేల్చి చెప్పింది. 36 రాఫెల్ జెట్ల కొనుగోలు డీల్ కు సుప్రీం కోర్టు గతేడాది క్లీన్ చిట్ ఇచ్చి న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వం త్ సిన్హా , అడ్వొకే ట్ ప్రశాం త్ భూషణ్, ఆప్ లీడర్ సంజయ్ సింగ్ సుప్రీం కోర్టులో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు ఫైల్ చేశారు. సోమవారం ఇవి విచారణకు రావాల్సివుండగా, కేంద్రం వాయిదా కోరింది

Latest Updates