రాఫెల్ పై సుప్రీంలో రివ్యూ పిటిషన్

ఇండియా-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. సీనియర్ లాయర్ ప్రశాంత భూషణ్ వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు ప్రశాంత్ భూషణ్. గతంలో సుప్రీంకోర్టు రాఫెల్ విషయలో ఎలాంటి అవకతవకలు లేవని ఓసారి తీర్పు చెప్పింది. తాజాగా మళ్ళీ ఆరోపణలు రావడంతో..  కేసును మళ్లీ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.

Latest Updates