సెప్టెంబర్ లో ఇండియాకి రాఫెల్.. ఏ బేస్ లో పెడతారంటే..

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అనుకున్నట్లుగానే షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ అవుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. తొలి యుద్ధ విమానం సెప్టెంబరులో ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ నుంచి డెలివరీ అవుతుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఫ్రాన్స్ లోనే దీన్ని డెలివరీ చేస్తారని, అక్కడి నుంచి దాన్ని భారత్ కు తీసుకుని వస్తామని చెప్పారు.

36 ఫైటర్ జెట్స్ కోసం ఫాన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతి రోజూ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రాఫెల్ డీల్ నే అస్త్రంగా చేసుకుని మోడీపై రాహుల్ గాంధీ దాడి చేస్తున్నారు. అనీల్ అంబానీకి మేలు చేయడం కోసం మధ్యవర్తిగా మోడీ వ్యవహరించారని, డీల్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు వచ్చాక వాటిని హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్ లోని హసింపురా బేస్ లలో మోహరించాలని ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. 1997 నుంచి అంబాలాలోని కోబ్రా స్క్వార్డన్ లో మిగ్-21 యుద్ధ విమానాలు కీలకంగా ఉన్నాయి. రానున్న రెండేళ్లలో వాటి స్థానంలో రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నాయి. అంబాలాలోని మిగ్ యుద్ధ విమానాలను రాజస్థాన్ నల్ ఎయిర్ బేస్ కు మారుస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ షిఫ్టింగ్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే డిఫెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి.

Latest Updates