బడుగు,బలహీన వర్గాలకు న్యాయం చేసేది బీజేపీ మాత్రమే

బడుగు,బలహీన వర్గాలకు న్యాయం చేసేది బీజేపీ మాత్రమేనన్నారు ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్.దళిత మోర్చా పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ అగ్రకులాల పార్టీ అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ కు అన్యాయం చేసింది కాంగ్రెస్,కమ్యూనిస్టులేనన్నారు. అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చంది బీజేపీయేనని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ..బడుగు,బలహీన వర్గాల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కొంతమందికి మాత్రమే ధనవంతులయ్యారని ఆరోపించారు.

 

Latest Updates