మహేష్ బాబు చేతుల మీదుగా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’

‘ఫాదర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా’ గా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని బాబ్జీ దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రధారిగా సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఉదయం విడుదల చేశారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్ర యూనిట్‌కు మహేష్ బాబు తన అభినందనలు తెలిపారు.

Latest Updates