YSR మాకు అన్న.. ఇందిర, రాజీవ్ లతో సమానం : రఘువీరా

కడప: హోదా భరోసా యాత్రలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కడపలో యాత్ర కొనసాగించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నలాంటి వ్యక్తి అన్నారు. “ఏపీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లకు ఎంత గౌరవం ఇస్తుందో… అంతే గౌరవం మా అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇస్తుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం మా అన్న వైయస్సార్ ఆశయం. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఏపీ కాంగ్రెస్ పని చేస్తుంది” అన్నారు రఘువీరారెడ్డి.

ఐతే… కడప పట్టణం రింగ్ రోడ్డు నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు, టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు, కార్యకర్తలు సుమారు వంద బ్యానర్ల వరకు కట్టారు. ఏ ఒక్క బ్యానర్లో కూడా వైయస్సార్ ఫోటో లేకపోవడంపై స్థానికులు చర్చించుకున్నారు.

Latest Updates