డ్రగ్ టెస్ట్‌‌‌లో దొరకొద్దని యూరిన్ శాంపిల్స్‌‌లో నీళ్లు!

మోసం చేయడానికి రాగిణి ద్వివేది యత్నం
బెంగళూరు: కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రముఖ శాండల్‌‌వుడ్ హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గర్లానీతోపాటు పలువురు ఇతరులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా రాగిణికి డోపింగ్ టెస్టులు నిర్వహించగా నటి తన తెలివితేటలు చూపించి మోసం చేయడానికి యత్నించిందని సమాచారం. డ్రగ్ టెస్టింగ్ కోసం తీసుకున్న యూరిన్ శాంపిల్స్‌‌‌లో రాగిణి నీళ్లు కలిపిందని తెలుస్తోంది. ఆ తర్వాత సదరు శాంపిల్స్‌‌ను మల్లేశ్వరంలోని కేసీ జనరల్ ఆస్పత్రి డాక్టర్లకు అందించింది. అయితే యూరిన్ శాంపిల్స్‌‌లో నీళ్లు కలిపిన విషయాన్ని డాక్టర్లు గుర్తించారని సీసీబీ అధికారులు తెలిపారు. యూరిన్ డ్రగ్ టెస్ట్ ద్వారా గత కొన్ని రోజుల్లో నార్కోటిక్స్‌‌ను వాడారా లేదా అనేది తెలుసుకోవచ్చు. యూరిన్‌‌లో వాటర్ కలిపితే యూరిన్ టెంపరేచర్ తగ్గుతుంది. తద్వారా అది శరీర ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది. రాగిణి చర్యను సిగ్గుమాలినదిగా, దురదృష్టకరమైనదిగా సీసీబీ అధికారి పేర్కొన్నారు.

Latest Updates