దమ్ముంటే మౌలాలికి రా.. కేటీఆర్ కు రఘునందన్ సవాల్

భాగ్యనగర అభివృద్దికి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ నాయకులు అవినీతికి కేరాఫ్ గా మారారని విమర్శించారు. గ్రేటర్ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ అభివృద్దిని తాము చూసుకుంటామని… కేటీఆర్ అమెరికాకు, సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ కు పోవాలని సూచించారు. మౌలాలి  డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సునితా చంద్రశేఖర్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రఘునందన్. దమ్ముంటే 138 డివిజన్ కి వచ్చి అభివృద్ది ఏం చేశారో చూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.

నాలాలో కొట్టుకొనిపోయి చనిపోయిన సుమేధ హత్యకు బాధ్యత వహించాలన్నారు.ఆమె కుటుంబ సభ్యులకు భహిరంగంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు..మౌలాలి డివిజన్ లో మచ్చుతునకయినా అభివృద్ధి చేయలేదన్నారు. డివిజన్ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

Latest Updates