రాంచీ టెస్టు: రోహిత్ 150.. రహానే 100

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో  రోహిత్, రహానే చెలరేగి ఆడుతున్నారు.నిన్న సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ ఇవాళ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాట్స్ మెన్  రహానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  169 బంతుల్లో 100 పరుగులు  చేశాడు.ఇందులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఓవర్ నైట్ స్కోరు 224/3 తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఇండియా ప్రస్తుతం 70 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. రోహిత్ 150, రహానే 100 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Latest Updates