రాఫెల్ ఒప్పందంలో మోడీ అవినీతికి సాక్ష్యం ఇదే :రాహుల్

ఎయిర్ ఫోర్స్ రూ.30వేల కోట్లను అంబానీకి మోడీ దోచిపెట్టారు : రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరో తీవ్ర ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ… రాఫెల్ ఒప్పందంలో ప్రధాని అవినీతికి పాల్పడ్డారని మరోసారి ఆరోపించారు. ఏడాది కాలంగా చేస్తున్న విమర్శలకు ఇదే ఆధారం అంటూ… రక్షణ శాఖ అధికారులు విడుదల చేసిన పత్రాలను సాక్ష్యంగా చూపించారు. రాఫెల్ ఒప్పందంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర సంప్రదింపులు జరిపారని అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఆస్తి రూ.30వేల కోట్లను అనిల్ అంబానీకి దోచి పెట్టారని అన్నారు.

రాఫెల్ ఒప్పందంలో లో  ప్రధాని మోడీకి ప్రత్యక్షంగా పాత్ర  ఉందని  ఆరోపించారు రాహుల్ గాంధీ. రాఫెల్ ఒప్పందంపై  ప్రాన్స్ తో  పీఎంవో  నేరుగా చర్చలు జరిపిందని  విమర్శించారు.

Latest Updates