రాయచూరుకు చంద్రబాబు : రాహుల్ తో కలిసి ప్రచారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కడప జిల్లాలో పర్యటన ముగించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్లారు. ప్రత్యేక విమానంలో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు వెళ్లారు సీఎం. ఓర్వకల్లు నుంచి కర్ణాటకకు వెళ్తున్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా.. ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు.

మూడో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే రాయచూరులో రాహుల్ గాంధీతోపాటు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.

 

Latest Updates