ఫాలోవర్స్ లో మోడీ.. ట్వీట్స్ లో రాహుల్

ఎన్నికల వేల వరుస ట్వీట్ లతో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ఇందుకుగాను అక్టోబర్ 2018 నుంచి ఎప్రిల్  2019 వరకు రాహుల్, ప్రధాని మోడీ చేసిన ట్వీట్ లను పరిశీలించింది ఓ జాతీయ మీడియా సంస్ధ. ఈ ఆరు నెలల కాలంలో రాహుల్ గాంధీ 7665 ట్వీట్ లను చేశారు. ప్రధాని మోడీ మాత్రం 2984 ట్వీట్ లను చేసినట్టు తెలిపారు. ట్వీట్ చేయడంలో మోడీని దాటేసిన రాహుల్ ఫాలోవర్స్ లో మాత్రం  వెనకబడిపోయారు. మోడీకి 47.1మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. రాహుల్ కి మాత్రం 9.34 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.  224మంది లోక్ సభ ఎంపీలు చేసిన ట్వీట్ లను గమనించగా మొత్తం 2లక్షల 68 వేల ట్వీట్ లను పరిశీలించారు. ఇందులో 160 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.

ఫాలోవర్స్ లో మోడీ, రాజ్ నాథ్, సుష్మా స్వరాజ్, అరున్ జైట్లీ, రాహుల్ గాంధీ లను పరిశీలించగా.. మోడీ మొదటి ప్లేస్ లో.. రాహుల్ ఐదవ స్థానంలో ఉన్నారు.

Latest Updates