అండర్ 14లో రెచ్చిపోతున్న రాహుల్ ద్రావిడ్ కొడుకు

మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ద్రవిడ్ ఎలాగైతే ఓపికగా ఆడతాడో.. అలాగే ఆయన కుమారుడు సమిత్ కూడా అంతే ఓపికగా ఆడుతూ డబుల్ సెంచరీలను నమోదు చేస్తున్నాడు. బీటీఆర్ షీల్డ్ అండర్ -14 మ్యాచ్‌కోసం; మాల్యా అదితి ఇంటర్నేషనల్‌ స్కూల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ 146 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ డబులో సెంచరీలో సమిత్ 33 బౌండరీలు కొట్టాడు. సమిత్ టీం 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ కుమారన్ చిల్డ్రన్స్ అకాడమీ 110 పరుగులకే ఆలౌటయింది. దాంతో సమిత్ టీం 267 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన సమిత్ బౌలింగ్‌లో కూడా సత్తా చాటాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చెందిన రెండు వికెట్లు తీశాడు.

సమిత్ గతంలో కూడా ఒక డబుల్ సెంచరీ నమోదు చేశాడు. డిసెంబర్ 2019లో అండర్ -14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో ధార్వాడ్ జోన్‌పై ఉపరాష్ట్రపతి ఎలెవన్ తరఫున ఆడి 201 పరుగులు చేశాడు. అప్పుడు సమిత్ 256 బంతులలో.. 22 ఫోర్లు కొట్టి 201 పరుగులు చేశాడు.

For More News..

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో దెయ్యాలను తరలించారంట.!

Latest Updates