పొరుగు దేశాలతో సంబంధాలను మోడీ నాశనం చేశారు

న్యూఢిల్లీ: పొరుగు దేశాల్లో మిత్రులు లేకపోతే భారత్‌‌కు ప్రమాదమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను నాశనం చేశారని ప్రధాని మోడీపై రాహుల్ మండిపడ్డారు. ‘కొన్ని దశాబ్దాలుగా పొరుగు దేశాలతో కాంగ్రెస్ నిర్మించిన సంబంధాలను మోడీ నాశనం చేశారు. మిత్రులు లేకుండా నివసించడం చాలా ప్రమాదకరం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు ది ఎకనామిస్ట్ రిపోర్ట్‌‌ను జత చేశారు. దీని ప్రకారం.. బంగ్లాదేశ్‌‌తో భారత్ సంబంధాలు బలహీనం అవుతుండగా అదే సమయంలో చైనా-బంగ్లా రిలేషన్స్ బలపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో కేంద్ర ఫారెన్ పాలసీపై పలుమార్లు రాహుల్ విమర్శించారు. కరోనాను ఎదుర్కోవడం, ఎకానమీని పడిపోకుండా చూడటం, నిరుద్యోగికతను తగ్గించడం, చైనాతో వివాదాన్ని పరిష్కరించడంలోనూ కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ రాహుల్ దుయ్యబడుతున్న విషయం తెలిసిందే.

Latest Updates