అంబానీకి మధ్యవర్తిగా మోడీ : రాహుల్ ఎటాక్

ఢిల్లీ : రాఫెల్ డీల్ విషయంలో కేంద్రప్రభుత్వంపై వరుసగా ఆరోపణల దాడి చేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ఫ్రెంచ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంలో… పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మధ్యవర్తిలాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరించాలని ఆరోపించారు. రక్షణ మంత్రి, విదేశాంగమంత్రి, హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రతినిధులకు తెలియక ముందే.. అనిల్ అంబానీకి 36 జెట్ ఫైటర్ విమానాల డీల్ తెలిసిందన్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ ఇ-మెయిల్ ను … కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాకు చూపించారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి రాఫెల్ డీల్ పై ప్రకటన చేయడానికి ముందే… అనిల్ అంబానీ ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ ను కలిసి వచ్చారని అన్నారు.

దేశ భద్రత విషయంలో నరేంద్రమోడీ రాజీపడ్డారని … గూఢచారి లాగా ప్రవర్తించి రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు రాహుల్ గాంధీ.  CAG అంటే చౌకీదార్ ఆడిటర్ జనరల్ అని ఆరోపించారు కాంగ్రెస్ చీప్. రాఫెల్ డీల్ లో కచ్చితంగా అవినీతి జరిగిందన్నారు.

Latest Updates