జులై 12న స్వయంగా హాజరుకండి.. రాహుల్ కు కోర్టు సమన్లు

అహ్మదాబాద్: క్రిమినల్​ డిఫమేషన్ ​కేసు విచారణలో భాగంగా జులై 12న స్వయంగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ ​చీఫ్​ రాహుల్​గాంధీకి అహ్మదాబాద్​ కోర్టు నోటీసులు జారీ చేసింది. అహ్మదాబాద్​ డిస్ట్రిక్ట్​కో ఆపరేటివ్​బ్యాంక్​చైర్మన్​ దాఖలు చేసిన పరువునష్టం కేసులో భాగంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

నోట్ల రద్దు తర్వాత 745.59 కోట్ల విలువైన పాతనోట్లను మార్చడంలో కో ఆపరేటివ్​బ్యాంక్​హస్తం ఉందంటూ రాహుల్​గాంధీ గతంలో ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్​సుర్జేవాల కూడా ఇవే ఆరోపణలు చేశారు. దీనిపై బ్యాంక్ తో పాటు చైర్మన్​కూడా కోర్టు కెక్కారు. రాహుల్, సూర్జేవాలాపై పరువునష్టం దావా దాఖలు వేశారు.

విచారణలో భాగంగా స్వయంగా హాజరుకావాలంటూ కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న రాహుల్​విచారణకు హాజరు కావాల్సింది. అయితే, తన క్లైంట్​కు మరికొంత సమయం కావాలంటూ రాహుల్​ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు గడువు మంజూరు చేశారు. జులై 12న రాహుల్​తో పాటు సుర్జేవాలా కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Latest Updates