కశ్మీర్‌కు ఎప్పుడు రమ్మంటారు : రాహుల్‌ గాంధీ 

కశ్మీర్‌ పర్యటనకు ఎప్పుడు రమ్మంటారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను అడిగారు. కశ్మీర్‌ పర్యటనకు రావాలంటూ గవర్నర్‌ పంపిన ఆహ్వానాన్ని ఎలాంటి షరతులు లేకుండా అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. తాను ప్రతిపక్ష నేతల బృందంతో కశ్మీర్‌ పర్యటనకు వస్తానని, అక్కడ స్వేచ్ఛగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని గతంలో రాహుల్‌ గాంధీ కోరారు. దీనిపై గవర్నర్‌ స్పందిస్తూ ఇన్ని షరతులా అన్నారు. గవర్నర్‌ వ్యాఖ్యలపై ప్రతిస్పందిస్తూ షరతులు ఏవీ లేకుండానే తాను వస్తానని రాహుల్‌ తెలిపారు.

జమ్మూకశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, చూడాలని భావిస్తే  రాహుల్ గాంధీ కోసం ఓ విమానం పంపుతానని గవర్నర్ మాలిక్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ…మీ విమానం మాకు అవసరం లేదు… మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను, సైనికులను కలుసుకుని వారితో మాట్లాడే విషయంలో సహకరించండి చాలు అంటూ రాహుల్ ట్విట్టర్ ట్వీట్ చేశారు.

Latest Updates