మేనల్లుడి కంటే ఫాస్ట్ : ముందే తిరుమల చేరుకున్న రాహుల్

తిరుమల:  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఉదయం తిరుపతి చేరుకుని..అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. గంటన్నర టైమ్ లోనే రాహుల్‌ తిరుమల చేరుకున్నారు. ఎలాంటి బ్రేకులు లేకుండా ఏకధాటిగా రాహుల్ నడక సాగింది. మధ్య మధ్యలో సహచరుల్ని, భక్తులను పలకరిస్తూ నడిచారు.

రాహుల్ గాంధీతోపాటు.. ఆయన మేనల్లుడు, ప్రియాంకా గాంధీ కొడుకు అయిన రేహన్ గాంధీ కూడా అలిపిరి మార్గంలో మెట్లు ఎక్కారు. మేనల్లుడి కంటే 15 నిమిషాల ముందే రాహుల్ గాంధీ కొండ పైకి చేరుకున్నారు.

ఆ తర్వాత… తిరుమలలో శ్రీవారిని రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. దర్శనం తర్వాత.. సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. గత ఎన్నికల్లో మోదీ నిర్వహించిన సభాస్థలంలోనే రాహుల్ సభ జరగనుంది.

Latest Updates