కొడుకుల కోసం పార్టీని ముంచిన్రు: రాహుల్  

rahul-gandhi-comments-on-senior-congress-leaders-in-cwc
  • CWC భేటీలో  కాంగ్రెస్ చీఫ్  రాహుల్  వ్యాఖ్యలు
  • గెహ్లాట్, కమల్ నాథ్, చిదంబరంపై కామెంట్

న్యూఢిల్లీ: కొడుకుల కోసం పార్టీని పణంగా పెట్టారంటూ పలువురు సీనియర్లపై  కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అనలైజ్ చేసుకునేందుకు నిర్వహించిన కాం గ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్ యూసీ) భేటీలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆ ఇన్ సైడర్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. CWC  భేటీలో వెస్ట్ యూపీచీఫ్ జ్యోతిరాధిత్య సింధియా మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో స్థానికంగా బలమైన నేతలను పోటీలో నిలబెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు . ఆ సమయంలో జోక్యం చేసుకున్న రాహుల్.. కొందరు నేతలు తమ కొడుకులకు టికెట్లిప్పించుకునేందుకు ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్.. తమ కొడుకులకు టికెట్లివ్వా లని గట్టిగా పట్టు బట్టారని చెప్పారు . తనకు ఇష్టం లేకపోయినా ఇవ్వా ల్సొచ్చిందని అన్నారు. ఇదే క్రమంలో కేంద్ర మాజీ మంత్ర పి.చిదంబరం పేరును కూడా ప్రస్తావిం చారు.

కొడుకులను గెలిపించుకునే విషయంలో ఉన్న శ్రద్ధ, పార్టీని గెలిపించుకోవాలనే విషయంలో వారికి లేదని విమర్శించినట్లు తెలిసింది. తమ కొడుకులను ప్రమోట్ చేసుకునేందుకు పార్టీని పణంగా పెట్టారని ఆయన మండి పడ్డట్లు పార్టీ వర్గాలు చెప్పా యి. ఆయన లేవనెత్తిన అంశాలను ప్రజల్లో కి తీసుకెళ్లలేకపోయారని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపాయి. రాఫెల్ డీల్, ‘చౌకీదార్ చోర్ హై’నినాదం తదితరాలను బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం ​చేయలేకపోయారని అన్నట్లు చెప్పా యి. పార్టీలో అకౌంటబులిటీ ఉండాలని ఆయన కామెంట్ చేసినట్లు తెలిపాయి.

ఇద్దరే గెలుపు

పలువురు సీనియర్ నేతలు తమ కొడుకులు,కూతుళ్లను ఎన్నికల్లో పోటీకి ని లబెట్టారు . కానీ అందులో చాలామంది ఓడిపోయారు. అశోక్గెహ్లాట్  కొడుకు వైభవ్ గెహ్లాట్, మాధవ్ రావ్సింధియా కొడుకు జ్యోతిరాధిత్య సింధియా,కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకుమాన్వేంద్ర సింగ్, కేంద్ర మాజీ మంత్రిసంతోష్ మోహన్ దేవ్ కూతురు సుస్మి తా దేవ్తదితరులు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.కమల్ నాథ్ కొడుకు నకుల్.. ఛింద్వా రా సీటు నుంచి, పి .చిదంబరం కొడుకు కార్తీ.. శివగంగ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు.

అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడానా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా రిజల్ట్స్ ఘోరంగా వచ్చాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ కొడుకులను గెలిపించుకోవడంలోనే మునిగిపోయి పార్టీని గాలికి వదిలేశారన్నారు . కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్, చిదంబరంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీ స్ గఢ్ రాష్ర్టాల్ లో బీజేపీని ఓడించి కాం గ్రెస్ గెలిచిం ది . అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. రాజస్థాన్ లో 2014లో మాదిరే బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ కాం గ్రెస్ అధికారంలో ఉన్నా ,ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. రాజస్థాన్ లోపోటీ చేసిన అశోక్ గెహ్లాట్ కొడుకు 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదేపరిస్థితి. బీజేపీ దాదాపు క్లీ న్ స్వీ ప్ చేసింది. అక్కడ 29సీట్లుం టే, బీజేపీ 28 స్థా నాల్లో గెలుపొందింది.

Latest Updates