కేర‌ళ నుంచి కూడా పోటీ చేయ‌బోతున్న రాహుల్

Rahul Gandhi has contest from Wayanad constituency.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈసారి అమేథీ తో పాటు మరో లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌నున్నారు. రెండవ‌ స్థానం నుంచి కూడా పోటీ చేయ‌మ‌ని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క మ‌రియు కేర‌ళ కాంగ్రెస్ క‌మిటీల నుంచి అభ్య‌ర్ధ‌న‌లు రావ‌డంతో రాహుల్ ఈ పోటీకి ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. రాహుల్ గ‌త కొన్నేళ్ల నుంచి ఉత్త‌రప్ర‌దేశ్ లోని అమేథీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల సమాచారం మేర‌కు ఆయ‌న ఈసారి అమేథీతో పాటు, కేర‌ళ‌లోని వ‌యానాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేరళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముళ్లప్పళి రామచంద్రన్ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. వాయనాడ్ నుంచి బరిలో దిగేందుకు రాహుల్ అంగీకరించిన‌ట్టు ఆయ‌న మీడియాకు వెల్లడించారు.

అమేథీ నుంచి ఈసారి బీజేపీ త‌ర‌పున‌ స్మృతి ఇరాని.. రాహుల్ ప్ర‌త్యర్థిగా పోటీ చేయ‌బోతుంది. అయితే ఇప్ప‌టికే యూపీలో బీజేపీ ప్ర‌భుత్వం న‌డుస్తోంది. అక్క‌డి మెజారిటీ ప్ర‌జ‌లు కూడా బీజేపికే అనుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార‌ణాల చేత‌నే రాహుల్.. అమేథితో పాటు మ‌రో స్థానంలో పోటీ చేస్తున్నారా అనే అనుమానం ఇప్ప‌టికే రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైంది.

Latest Updates