లండన్ టూర్ లో రాహుల్

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ప్రస్తుతం లండన్‌‌‌‌‌‌‌‌ పర్యటనలో ఉన్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన గత మంగళవారమే లండన్‌‌‌‌‌‌‌‌ వెళ్లినట్టు తెలిసింది. తిరిగి ఈ నెల 17న ఇండియాకు రావొచ్చని భావిస్తున్నారు. అదే రోజు ప్రారంభం కానున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ వర్షాకాల సమావేశాల్లో రాహుల్‌‌‌‌‌‌‌‌ పాల్గొంటారని సమాచారం. పంజాబ్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ నవజ్యోత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సిద్ధూతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ తర్వాత రాహుల్‌‌‌‌‌‌‌‌ లండన్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు బయల్దేరి వెళ్లారు. అంతకుముందు ఆయన వయనాడ్‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యతగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్‌‌‌‌‌‌‌‌ గత మూడు వారాలుగా పార్టీ నాయకులెవరినీ కలిసేందుకు ఇష్టపడలేదు. తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని, దానిపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ చర్చించకూడదని రాహుల్‌‌‌‌‌‌‌‌ గట్టిగా చెప్పారని ఓ సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ సీఎం అశోక్‌‌‌‌‌‌‌‌ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ సైతం రాహుల్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు ఢిల్లీలో నాలుగు రోజులు మకాం వేసినా ఫలితం లేకపోయింది.

Latest Updates