ఏపీలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే రెండ్రోజుల్లో రుణమాఫీ: రాహుల్

ప్రధాని మోడీ దొంగలకు చౌకీదార్‌గా మారారని తీవ్రమైన ఆరోపణ చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే రెండ్రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మేకిన్‌ ఇండియా అంటున్న మోడీ …దేశంలో ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అయ్యారని చెప్పారు. దేశంలోని ధనాన్నంతా అంబానీలకు మోడా ధారపోశారని ఆరోపించారు.

‘‘మోడీ పాలనలో మాల్యా,  నీరవ్‌మోడీ,  చోక్సీలకే లబ్ధిచేకూరింది. ఆయనకు సామాన్యుల బాధలు పట్టవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు..  ఉపాధి హామీ పథకంతో కోట్లాది మందికి పనికల్పించాం. డ్వాక్రా సంఘాలకు వడ్దీలేని రుణాలు ఇచ్చాం. మోడీ మాత్రం సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. భారత్‌ని మోడీ రెండు భాగాలు చేశారు.. ఒకటి శ్రీమంతుల భారత్‌.. రెండోది పేదల భారత్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. న్యాయ్‌ పథకాన్ని తీసుకొస్తాం. దేశంలో నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు ఉన్నారు. వారికి ఏడాదికి రూ.72 వేలు బ్యాంకుల్లో వేస్తాం.’’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు.

Latest Updates