రాహుల్ ఆర్మీని, దేశాన్ని నిరుత్సాహ పరుస్తున్నారు

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనా వల్ల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ నాయకులు కూడా రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకొని అటాక్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాహుల్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్‌కు సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన ఒక్క మీటింగ్‌కు కూడా రాహుల్ హాజరు కాలేదని నడ్డా దుయ్యబట్టారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ను ప్రశ్నించడం ద్వారా దేశాన్ని నిరుత్సాహపరుస్తున్న కాంగ్రెస్ ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు.

‘రాహుల్ గాంధీ ఓ అద్భుతమైన సంప్రదాయాలను పాటించే రాజవంశానికి చెందిన వ్యక్తి. అక్కడ డిఫెన్స్ విషయాలను కమిటీలు పట్టించుకోవు. ఆ పనిని కమిషన్‌లు చేస్తాయి. పార్లమెంటరీ విషయాలను అర్థం చేసుకోగల చాలా మంది సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ అలాంటి వారిని ఓ రాజవంశం ఎన్నటికీ ఎదగనివ్వదు. ఇది చాలా బాధాకరం’ అని నడ్డా విమర్శించారు.

Latest Updates