రాహుల్ రాజీనామాను తిరస్కరించిన CWC

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేయడానికి సిద్దపడగా..సీడబ్ల్యూసీ తిరస్కరించిందని మీడియా ముందు చెప్పారు  కమిటీ సభ్యులు. దాదాపు 3 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై  చర్చ జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు CWCలోని ఇతర సభ్యులు హాజరయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కమిటీ సభ్యులు..  రాహుల్ గాంధీ సమక్షంలోనే పార్టీ ముందుకెళ్తుందని..పార్టీ పునర్నిర్మాణ బాధ్యతను కూడా ఆయనకే అప్పగించామని చెప్పారు.

Latest Updates