చౌకీదార్ చోర్ కామెంట్ పై సారీ : సుప్రీంకు రాహుల్ వివరణ

రాఫెల్ డీల్ విషయంలో చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందని తాను చెప్పిన మాటను వెనక్కి తీసుకున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. చౌకీదార్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక దొంగ అని సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందని ఆ మధ్య రాహుల్ గాంధీ ఓ విమర్శ చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి .. సుప్రీంకోర్టులో కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు నోటీసు పంపడంతో.. రాహుల్ గాంధీ లేటెస్ట్ గా రిప్లై ఇచ్చారు.

“సుప్రీంకోర్టు అన్న పదం వాడినందుకు పశ్చాత్తాపడుతున్నా. ఎన్నికల ప్రసంగ వేడిలో ఆ మాట వాడాను. ఏ కోర్టు కూడా చౌకీదార్ ను చోర్ అని అనలేదు. కానీ చౌకీదార్ అనే పదాన్ని రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా వాడుకుంటున్నారు” అని వివరణ ఇచ్చారు.

ఈ కేసు మంగళవారం కోర్టులో విచారణకు రానుంది.

Latest Updates