రేప్‌ల రాజధానిగా భారత్: రాహుల్ గాంధీ

ప్రపంచంలోనే రేప్‌లకు భారత్ రాజధానిగా మారుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌తో తమ బిడ్డలను, అక్కచెల్లెళ్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు అడుగుతున్నాయన్నారు. యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసులో నిందితుడిగా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కనీసం నోరు మెదపకపోవడం ఘోరమని అన్నారు. ఉన్నావ్ రేప్ బాధితురాలి సజీవ దహనం, హైదరాబాద్ దిశ ఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేరళలోని వాయనాడ్ ఎంపీ అయిన రాహుల్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం అక్కడ ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. హింసను నమ్మే వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తుండం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే ఓ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నా ప్రధాని మోడీ నోటి వెంట ఒక్కమాట రాలేదన్నారు.అంతకుముందు ఉన్నావ్ రేప్ బాధితురాలు ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంపై రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉన్నావ్‌కు చెందిన మరో అమాయకురాలు మరణించడం మానవత్వానికే సిగ్గుచేటని అన్నారు. దిశంలో మరో బిడ్డ న్యాయం కోసం, రక్షణ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ట్వీట్ చేశారు రాహుల్. బాధితురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

MORE NEWS:

ఉన్నావ్ రేప్ బాధితురాలు మృతి

ప్రతీకారం తీర్చుకోవడం న్యాయం కాదు: సుప్రీం చీఫ్ జస్టిస్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల కమిషన్‌కు సమాధానం చెబుతాం: సజ్జనార్

Latest Updates