సారీ చెప్పిన రాహుల్ : ప్రచారంలో మాట దొర్లిందట

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ గురించి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సోమవారం సుప్రీంకోర్టులో ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన  వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగానే తాను కాపలదారు దొంగ అనే వ్యాఖ్యలు చేసినట్టుగా రాహుల్ వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచార వేడిలో భాగంగానే మాట దొర్లిందని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

రాహుల్ గాందీ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్- 15వ తేదీన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టుకు  నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ లోపుగా ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం నోటీసులకు రాహుల్ గాంధీ మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రెండు అఫిడవిట్లను ఎందుకు దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.

Latest Updates