రోడ్డుపై గాయాలైన జర్నలిస్టును కాపాడిన రాహుల్

కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న జర్నలిస్టును కాపాడి ఆదుకుని ప్రశంసలు అందుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారం కారులో వెళుతుండగా రోడ్డుపై గాయాలైన ఓ వ్యక్తిని కారులో ఎక్కించి  ఆస్పత్రికి తరలించారు.

రాజస్థాన్ కు చెందిన రాజేంద్ర వ్యాస్ అనే జర్నలిస్టు ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో తలకు దెబ్బతగిలి  రక్తం కారుతూ పడి ఉన్నారు. అదే సమయంలో కారులో వెళుతున్న రాహుల్ గాంధీ అతడిని చూసి కారు ఆపి అతడిని ఎక్కించి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో జర్నలిస్టు కవరేజీలో భాగంగా మెట్లపై నుంచి కిందపడిపోతుండగా రాహుల్ అతడికి చేయిచ్చి పైకి లేపాడు.

Latest Updates